మరోసారి అందర్నీ కెలికేసిన వర్మ

- Advertisement -
Ram Gopal Varma

దర్శకుడు వర్మకు కెలుకుడు కొత్త కాదు. పవన్ కల్యాణ్, చిరంజీవి, చంద్రబాబు.. ఇలా ఎంతోమంది ప్రముఖులపై అతడు ఏకంగా సినిమాలు (సినిమాల్లాంటివి) తీశాడు. ఇప్పుడు తన కెలుకుడును పీక్ స్టేజ్ కు తీసుకెళ్లాడు ఈ దర్శకుడు. ఒకే సినిమాతో అందర్నీ కెలికేశాడు. పాతవాళ్లకు అదనంగా ఈసారి కొన్ని కొత్త క్యారెక్టర్లు కూడా పరిచయం చేశాడు.

తాజాగా “ఆర్జీవీ మిస్సింగ్” ట్రయిలర్ రిలీజైంది. దీని సారాంశం ఏంటంటే, దర్శకుడు వర్మ కిడ్నాప్ అవుతాడు. అతడ్ని ఎవరు కిడ్నాప్ చేశారనేది సస్పెన్స్. ఈ క్రమంలో మరోసారి నాగబాబు, చంద్రబాబు, పవన్, చిరంజీవి, కేఏ పాల్, లోకేష్ లాంటి పాత్రల్ని పోలిన క్యారెక్టర్లను వాడేశాడు వర్మ. వీళ్లకు అదనంగా ఈసారి రజనీకాంత్, జొన్నవిత్తుల, కేసీఆర్ లాంటి వ్యక్తుల్ని పోలిన పాత్రల్ని కూడా ప్రవేశపెట్టాడు.

ఆర్జీవీ కిడ్నాప్ కేసును గజనీకాంత్ (రజనీకాంత్ డూప్) హ్యాండిల్ చేస్తాడు. ఇందులో భాగంగా పైన చెప్పకున్న పాత్రలందర్నీ ఇంటరాగేట్ చేస్తాడు. ఒకదశలో చిరంజీవి, పవన్, నాగబాబు పాత్రలు అరెస్ట్ కాకుండా ఉండేందుకు అజ్ఞాతంలోకి కూడా వెళ్లిపోతాయి. ఇలా సాగింది ఈ ట్రయిలర్ కథ.

త్వరలోనే ఈ సినిమాను తన “ఆర్జీవీ వరల్డ్” లో రిలీజ్ చేయబోతున్నాడు వర్మ. ఇంతకీ ఇదైనా 30 నిమిషాల రన్ టైమ్ దాటిందో లేదో!

 

More

Related Stories