‘మళ్ళీ పెళ్లా? బుద్ది రాలేదా సుమంత్’

RGV and Sumanth

రామ్ గోపాల్ వర్మ కొత్త ట్వీట్ వైరల్ అయింది. రామ్ గోపాల్ వర్మ ఈ సారి హీరో సుమంత్ ని టార్గెట్ చేశారు. సుమంత్ మళ్ళీ పెళ్లి చేసుకోబుతున్నారని మీడియాలో వార్తలు రావడంతో వర్మ స్పందించారు. ఆయన శైలిలో స్ట్రాంగ్ కామెంట్ పడింది.

“ఒక సారి అయ్యాక కూడా నీకింకా బుద్ది రాలేదా సుమంత్? నీ ఖర్మ, ఆ పవిత్ర ఖర్మ. అనుభవించండి,” అంటూ కామెంట్ చేశారు వర్మ. అంతటితో ఊరుకోలేదు మరి. ఆ తర్వాత ఇంకోటి వెలువడింది.

“ఒక పెళ్లి నూరేళ్ళ పెంట అయితే రెండో పెళ్లేంటయ్యా స్వామీ? నా మాట విని మానెయ్యి. పవిత్ర గారూ మీ జీవితాలను పాడు చేసుకోకండి. తప్పు మీది, సుమంత్ ది కాదు. తప్పు ఆ దౌర్భాగ్య వ్యవస్థది.” – ఇది ఆర్జీవీ రెండో కౌంటర్.

గతంలో కీర్తి రెడ్డి అనే హీరోయిన్ తో పెళ్లి జరిగింది సుమంత్ కి. కానీ రెండేళ్లకే విడాకులు అయ్యాయి. 15 ఏళ్ళు ఒంటరిగా ఉన్న సుమంత్ ఇప్పుడు పవిత్ర అనే ఆవిడని పెళ్ళాడబోతున్నట్లు టాక్.

రామ్ గోపాల్ వర్మ పెళ్లి అనే కాన్సెప్ట్ కి వ్యతిరేకి. ఆయన కూడా తన భార్య నుంచి చాలా ఏళ్ల క్రితమే విడిపోయారు. అయితే, ఆయన కూతురు మాత్రం పెళ్లి చేసుకొని హ్యాపీగా అమెరికాలో స్థిరపడ్డారు. వర్మ ఇటీవలే తాతయ్య కూడా అవడం విశేషం.

 

More

Related Stories