తినండి తాగండి: ఆర్జీవీ

రామ్ గోపాల్ వర్మ ఒకప్పుడు గొప్ప గొప్ప సినిమాలు తీశారు. ఇప్పుడు రిటైర్మెంట్ బెనిఫిట్స్ పొందుతున్నారు. పొలిటికల్ పార్టీల కోసం ఏవో సినిమాలు తీస్తూ, ట్విట్టర్ లో పోస్టులు పెడుతూ కాలక్షేపం చేస్తున్నారు. ఇక రాత్రి కాగానే వోడ్కా, లెగ్స్ (అదేనండి కోడి లెగ్స్)తో లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంటారు. లివ్ ఇన్ ది మూమెంట్ (ఈ క్షణమే శాశ్వతం…దాన్ని ఆస్వాదించాలి) అనేది ఆయన పాలసీ.

మంచిగా చదువుకొని జీవితంలో ఎదగాల్సిన విద్యార్థులకు కూడా తన లైఫ్ స్టయిల్ నే ఫాలో అవండి అని బోధించి అందర్నీ షాక్ కి గురిచేశారు ఆర్జీవీ. నాగార్జున యూనివర్సిటీలో జరిగిన ఒక కార్యక్రమానికి వర్మ ముఖ్య అతిథిగా వెళ్లారు. నచ్చిన విధంగా ఉండాలని విద్యార్థులకు వర్మ హితబోధ చేశారు.

అక్కడితో ఆగలేదు వర్మ.

నచ్చింది తిని, కావాల్సినంత తాగి, ఇష్టం వచ్చినప్పుడు సెక్స్ చేయాలన్నట్లుగా వర్మ మాట్లాడడం అక్కడున్న ప్రొఫెసర్లను ఇబ్బంది పెట్టింది. దటీజ్ వర్మ.

 

More

Related Stories