నేనే ఫస్ట్ అంటున్న ఆర్జీవీ

- Advertisement -
RGV's Corona

కరోనా సంక్షోభం నుంచి తెలుగుసినిమా పరిశ్రమ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. థియేటర్లు కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పటికే మల్టిప్లెక్స్ లు మొదలయ్యాయి. ఐతే కొత్త సినిమాలు మాత్రం ఇంకా థియేటర్లోకి రాలేదు. లాక్డౌన్ తర్వాత విడుదల అయ్యే ఫస్ట్ మూవీ నాదే అంటున్నాడు రామ్ గోపాల్ వర్మ. ఆయన నిర్మించిన “కరోనా” అనే సినిమా డిసెంబర్ 11న విడుదల అవుతుంది.

హైదరాబాద్ లోని సంధ్య, వైజాగ్ లోని జగదాంబ వంటి పెద్ద థియేటర్లలో కూడా ప్రదర్శిస్తారట. సాయి ధరమ్ తేజ్ నటించిన “సోలో బ్రతుకే సో బెటర్” మూవీ డిసెంబర్ 25న థియేటర్లలోకి వస్తోంది. కానీ దాని కన్నా ముందే నాదే వస్తోంది, నేనే ఫస్ట్ అంటున్నాడు ఆర్జీవీ.

మరి రామ్ గోపాల్ వర్మ తీసిన “కరోనా”ని ఈ కరోనా కాలంలో చూసేందుకు జనం థియేటర్లకు వస్తారా?

 

More

Related Stories