
రామ్ గోపాల్ వర్మ తీసిన “వ్యూహం” దారుణంగా పరాజయం పాలైంది. ఆంధ్రప్రదేశ్ లోని అధికార పార్టీకి ఉపయోగపడేలా తీశారు వర్మ. ఐతే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా చూడలేదు. ఘోరమైన విమర్శలు వచ్చాయి. మొదటి ఆటకే టపా కట్టిన ఆ సినిమా ఫలితం చూసిన తర్వాత దానికి రెండో పార్ట్ గా తీసిన “శపథం” సినిమాని థియేటర్లో విడుదల చెయ్యడం లేదు.
ముందు అనుకున్న ప్లాన్ ప్రకారం ఈ శుక్రవారం (మార్చి 8న) “శపథం” థియేటర్లలోకి రావాలి. కానీ “వ్యూహం” సినిమాని ఎవరూ చూడలేదు కాబట్టి దీన్ని ఎవరూ పట్టించుకుంటారు? అందుకే ఇప్పుడు ఈ సినిమాని వెబ్ సిరీస్ గా మార్చి ఓటిటిలో విడుదల చేస్తున్నట్లు వర్మ ప్రకటించారు.
“శపథం ఆరంభం చాప్టర్ 1ని ఈ రోజు సాయంత్రం ఎనిమిది గంటలకు, అలాగే శపథం అంతం చాప్టర్ 2 ని రేపు మార్చి 8న 8 pmకి ఆంధ్రప్రదేశ్ లోని AP ఫైబర్ నెట్లో OTT App ద్వారా పే ఫర్ వ్యూలో చూసుకోవటానికి అవకాశం కలిపిస్తున్నాం. ఆ తర్వాత అన్నిటిలో రిలీజ్ చేస్తాం,” అని వర్మ వెల్లడించారు.
అదన్నమాట సంగతి. వర్మ “వ్యూహం”, “శపథం” అంటూ ఇన్నాళ్లూ చాలా హంగామా చేశారు. కానీ ఇప్పుడు ఇలా నీరుగారిపోయారు.