అటు రియా…. ఇటు సంజన

rhea sanjana arrest

ప్రస్తుతం సౌత్ ను, నార్త్ ను డ్రగ్స్ కేసు ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మరీ ముఖ్యంగా ఒకే రోజు 2 కీలక అరెస్టులు చోటుచేసుకోవడం గమనార్హం.

హీరో సుశాంత్ సింగ్ కేసులో డ్రగ్స్ వాడకానికిసంబంధించి అతడి ప్రేయసి రియా చక్రబొర్తిని మాదకద్రవ్యాల నిరోధక శాఖ అధికారులు ఈరోజు అరెస్ట్ చేశారు. ఇటు సౌత్ లో కన్నడనాట కలకలం సృష్టిస్తున్న డ్రగ్స్ కేసులో హీరోయిన్ సంజనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

శాండిల్ వుడ్ మాదకద్రవ్యాల మాఫియాలో సంజనను అక్రమంగా ఇరికించారంటూ ఆరోపిస్తున్నారు ఆమె తరఫు లాయర్. పోలీసులు మాత్రం స్పష్టమైన ఆధారాలతోనే అరెస్ట్ చేశామని చెబుతున్నారు. ఇటు రియాను కూడా ముంబయిలో ఎన్సీబీ అధికారులు 3 రోజుల పాటు విచారించి, స్పష్టమైన ఆధారాలు దొరికిన తర్వాతే ఈరోజు అదుపులోకి తీసుకున్నామని చెబుతున్నారు.

సుశాంత్ మరణం తర్వాతే రియా పాపులర్ అయింది. ఈ కేసు డ్రగ్స్ మలుపు తీసుకున్న తర్వాత మరింత మందికి రియా పేరు తెలిసొచ్చింది. అయితే సంజన విషయం వేరు. మొదట్నుంచి ఈమె వివాదాలకు పెట్టింది పేరు.

Sanjjanaa,

“దండుపాళ్యం-2” సినిమాకు సంబంధించిన లీక్ వీడియోతో సంజన సౌత్ అంతటా పాపులర్ అయింది. అందులో నగ్నంగా నటించానని కొన్ని రోజులు, ఆ తర్వాత తను కాదంటూ మరికొన్ని రోజులు వార్తల్లో వ్యక్తిగా మారింది సంజన. అంతేకాదు.. ఆ వీడియోను మేకర్స్ కావాలనే లీక్ చేశారంటూ పెద్ద వివాదానికి సైతం తెరతీసింది.

ఇది మాత్రమే కాదు.. మీటూ ఉద్యమం పీక్స్ లో నడుస్తున్న టైమ్ లో దర్శకుడు రవి శ్రీవత్స తనను హింసించాడంటూ పెద్ద బాంబ్ పేల్చింది సంజన. ఆ తర్వాత తనే స్వయంగా అతడికి క్షమాపణలు కూడా చెప్పింది. అంతేకాదు.. గతేడాది బెంగళూరులోని ఓ పబ్ లో సంజన, బీర్ బాటిల్ తో ఓ నిర్మాత తల పగలగొట్టిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

ఇలా కాంట్రవర్సియల్ సెలబ్రిటీగా కొనసాగుతున్న సంజన, ఇప్పుడు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అవ్వడం మరింత సంచలనంగా మారింది. 

Related Stories