ఇక ఇప్పుడు డ్రగ్సు కేసు!?

rhea drugs case

సుశాంత్ సింగ్ రాజపుత్ కేసు రోజురోజుకు ఎన్నో మలుపులు తిరుగుతోంది.మొన్నటి వరకు సుశాంత్ మాజీ గాళ్ ఫ్రెండ్ రియా …అతని డబ్బుని తన అకౌంట్లొకి మళ్లించింది అని ఆరోపణలు వచ్చాయి. ఈడి పరిశోధనలో ఇంతవరకు అలాంటిదేమి తేలినట్లు లేదు. ఒకవేళ అలా జరిగి ఉంటే, ఈపాటికి ఆమెని అరెస్ట్ చేసి ఉండేవారు. ఐతే, ఇప్పుడు ఆమె మెడకు డ్రగ్సు కేసు చుట్టుకునేలా ఉంది.

ఈడీ లేటెస్ట్ పరిశోధనలో రియా డ్రగ్ డీలింగ్ లో ఉన్నట్లు తేలిందట. అంతేకాదు, నార్కోటిక్ డిపార్ట్మెంట్ కి ఇప్పటికే సమాచారం ఇచ్చింది ఈడీ. తాను ఇంతవరకు డ్రగ్స్ తీసుకోలేదని రేహ చెప్తోంది. మరి ఈ కేసు ఇంకా ఏయే మలుపు తిరుగుతుంది అనేది చూడాలి.

సుశాంత్ నిజంగా ఆత్మహత్య చేసుకున్నాడా? లేదా హత్యగావించబడ్డాడా? సుశాంత్ తండ్రి ఆరోపిస్తున్నట్లు అతని ఆత్మహత్య చేసుకునేలా రియా చక్రవర్తి పరిస్థితులు క్రియేట్ చేసిందా? అన్న విషయాలు సిబిఐ ఇన్వెస్టిగేషన్ లో నెమ్మదిగా తెలుస్తాయి. ఐతే ఈ లోపు… ఈ కేసులో రోజుకో వాదన, రోజుకో కొత్త ‘పాయింట్”ని మీడియా హైలెట్ చేస్తోంది.

ముఖ్యంగా మూడు ఛానళ్ళు చేస్తున్న హంగామా… దారుణంగా ఉంది. సిబిఐ విచారణ ముగియకముందే… రియాని జైల్లో వెయ్యాలన్నంతగా కసిగా రిపోర్ట్ చేస్తున్నాయి. ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ అన్న ప్రాథమిక సూత్రానికి తిలోదకాలు ఇచ్చాయి ఈ మీడియా ఛానళ్ళు.

Related Stories