రియా మెడకి మళ్ళీ డ్రగ్స్ కేసు


హీరోయిన్ రియా చక్రవర్తిని సుశాంత్ సింగ్ మరణం, డ్రగ్స్ కేసు వెంటాడుతోంది. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ 2020లో మరణించాడు. సుశాంత్ తో సహజీవనం సాగించిన రియా ఒక ఏడాది పాటు డ్రగ్స్ కేసులో ఇరుక్కొంది. కొన్నాళ్ళూ జైలు జీవితం కూడా గడిపింది. ఆ తర్వాత ఆ కేసు నుంచి ఆమె బయటపడినట్లే అనిపించింది. అందరూ మరిచిపోయిన ఈ కేసు మరోసారి ముందుకొచ్చింది.

ఏడాది తర్వాత మరోసారి రియా మెడకు చుట్టుకొంది ఈ కేసు.

నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో బుధవారం (జులై 13) ఛార్జ్ షీట్ నమోదు చేసింది. సుశాంత్ సింగ్ కోసం ఆమె మారువనా (గంజాయి) కొనుగోలు చేసినట్లు ఈ ఛార్జిసీట్లో పేర్కొన్నారు. ఆమెతో పాటు ఆమె సోదరుడు సౌవిక్ చక్రవర్తిని కూడా ఈ కేసులో సహా నిందితుడిని చేశారు.

ఒకవేళ అభియోగాలు నిజమని కోర్టులో రుజువు ఐతే ఆమెకి పదేళ్ల జైలుశిక్ష పడే అవకాశం ఉంది. ఇప్పుడు, ఈ కేసుని తిరగదోడడం వెనుకున్న రాజకీయ కోణం ఏంటి అనేది అర్థం కావడం లేదు.

Also Check: Rhea Chakraborty shows off her Saree Shakti

 

More

Related Stories