చెహ్రాలో రియా ఫేస్ లేదు

Rhea

బాయ్ ఫ్రెండ్ సుశాంత్ సింగ్ మరణం తర్వాత డ్రగ్స్ కేసులో ఇరుక్కొని ఎన్నో కష్టాలు పడ్డ రియాకి ఇంకా కష్టాలు తీరట్లేదు. అన్ని మర్చిపోయి మళ్ళీ కెరీర్ పై దృష్టి సారించింది. ఐతే, ఆమె నటించిన ఒక సినిమా పబ్లిసిటీలో ఆమె ఫేస్ ని వాడేందుకు మేకర్స్ ఇంటరెస్ట్ చూపట్లేదు.

రియా చక్రవర్తి నటించిన ‘చెహ్రా’ సినిమా విడుదలకి రెడీ అవుతోంది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, ఇమ్రాన్ హస్మి వంటి పాపులర్ నటులున్నారు. రియా చక్రవర్తి ఒక హీరోయిన్. ఐతే, ఈ సినిమా ఫస్ట్ పోస్టర్ లో రియా లేదు. అమితాబ్, ఇమ్రాన్, అన్ను కపూర్, ఇంకో ఇద్దరు నటుల ఫోటోలు కూడా ఈ పోస్టర్లో ఉన్నాయి. కానీ అసలైన హీరోయిన్ ‘చెహ్రా’ (ముఖం) లేకుండా పోస్టర్ వచ్చింది. ఇది రియాకి షాక్ అని చెప్పొచ్చు.

పోస్టర్ నుంచే ఆమె ఫేస్ తీసేశారంటే… ఇక ట్రైలర్ లో కూడా ఆమె సీన్లు లేకుండా చేస్తారా? సినిమాలో కూడా ఆమె పాత్ర నిడివి తగ్గిస్తారా? అన్న ప్రశ్నలు వస్తున్నాయి. రియా ఈ సినిమాపై ఆశలు వదులుకోవాల్సిందే.

More

Related Stories