రియా ఫుల్లుగా ఇరుక్కున్నట్లేనా?

Rhea Chakraborty

రియా చక్రబోర్తి… సుశాంత్ సింగ్ మరణం కేసులో నుంచి బయటపడడం కష్టమే అనేది తాజా అభిప్రాయం. సీబీఐకి కేసుని అప్పగిస్తూ సుప్రీమ్ కోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే… పరిణామాలు టకాటకా మారిపోయాయి. సుశాంత్ సింగ్ కేసుని పూర్తిగా రాజకీయంగా మలిచిన ఒక సెక్షన్ అఫ్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం… సీబీఐ ఆమెని కస్టడీలోకి తీసుకునేందుకు రెడీ అవుతోంది. అంతేకాదు, ఆమె ఇరుక్కున్నట్లే అనిపిస్తోంది.

సుశాంత్ మరణం వెనుకున్న మిస్టరీని సీబీఐ ఛేదించే పనిలో ఉంది. ఐతే, దానికన్నా ముందు… ఈ కేసుతో పొలిటికల్ మైలేజ్ పొందేందుకు కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఆ పార్టీల కోసమే పనిచేసే రెండు, మూడు జాతీయ చానెల్స్ లో రోజు వస్తున్న వార్తలు, చర్చలు, సోషల్ మీడియాలో “ఒక వర్గం” వారు సాగిస్తున్న ట్రేండింగ్ చూస్తుంటే… రియా మెయిన్ టార్గెట్ కాదు అని అర్థం అవుతోంది. ఐతే, ఈ హీరోయిన్ మాత్రం ఈ కేసునుంచి బయటపడడం కష్టమే అనిపిస్తోంది.

అలాగే రియాతో పాటు అలియా భట్ తండ్రి మహేష్ భట్ కూడా ఇరుకున పడ్డట్లేనా అనేది చూడాలి. మహేష్ భట్, రియా మధ్య సాగిన వాట్సాఫ్ చాటింగ్ అంటూ కొన్ని స్నాప్ షాట్స్ బయటికివచ్చాయి. అవి నిజమే ఐతే… రియా చాలా అబద్దాలు చెప్పినట్లు అర్థం అవుతోంది. అలాగే మహేష్ భట్ పాత్ర ఏంటి అని విషయంలోనూ సిబిఐ దర్యాప్తు సాగిస్తుంది.

Related Stories