ఇక నెక్స్ట్ అరెస్ట్ రియాదే?

Rhea

సుశాంత్ సింగ్ రాజపుత్ మరణం వెనుకున్న కారణం ఏంటనే విషయంలో సిబిఐ ఇంకా ఇన్వెస్టిగేషన్ పూర్తి చెయ్యలేదు కానీ ఈ కేసు పూర్తిగా డ్రగ్స్ వైపు మళ్లింది. నిన్న (శుక్రవారం రాత్రి) రియా సోదరున్ని అరెస్ట్ చేశారు. రియా ప్రోద్బలంతో డ్రగ్స్ కొనేవాడిని అని ఆమె సోదరుడు సొహయిక్ నార్కోటిక్స్ అధికారుల విచారణల తెలిపేది. దాంతో డ్రగ్స్ సప్ప్లై ఆరోపణల్లో అతన్ని అరెస్ట్ చేశారు.

ఇక ఇప్పుడు రియా అరెస్ట్ కూడా తప్పదు అని వార్తలు వస్తున్నాయి. సిబిఐ మరిన్ని ఆధారాలతో రియాని అరెస్ట్ చేసేందుకు రెడీ అవుతుందట. డబ్బు కాజేసింది అన్న ఆరోపణని సుశాంత్ తండ్రి మొదటినుంచి చేస్తున్నారు. ఐతే, ఈ విషయంలో ఈడీకి గాని, సీబీఐకి గాని ఇప్పటివరకు అలంటి అధరాలు దొరకలేదట. వాట్సాప్ చాటింగ్స్ లో డ్రగ్స్ కొన్నట్లు బయటపడింది. దాంతో ఈ కేసు మొత్తంగా మలుపు తిరిగింది.

రియా… డ్రగ్స్ కొన్నట్లు లేదు తీసుకున్నట్లు రుజువైతే ఆమె జైలుకు వెళ్ళాక తప్పదు.

Related Stories