
రియా చక్రవర్తి కేసు ఒక పొలిటికల్ గిమ్మిక్ అన్న విమర్శలు పూర్తిగా నిజం అవుతున్నట్లు కనిపిస్తున్నాయి. ఆమెకి ఇప్పటికే డ్రగ్స్ కేసులో బెయిల్ వచ్చింది, సిబిఐ, ఈడీ, ఎన్సీబీ… సంస్థలు ఈ కేసు గురించి మళ్ళీ ఒక్క మాట మాట్లాడడం లేదు. ఇక లేటెస్ట్ గా రియా సోదరుడుకి కూడా బెయిల్ వచ్చింది. అతన్ని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ( ఎన్సీబీ) సెప్టెంబర్ లో అరెస్ట్ చేసింది. ఇన్నాళ్లు జైల్లో ఉన్న సౌవిక్ చక్రవర్తికి ఈ రోజు బెయిల్ లభించింది. ఇక దాదాపుగా ఈ కేసు అటకెక్కినట్లే.
సుశాంత్ సింగ్ రాజపుత్ మరణాన్ని బీహార్ ఎన్నికల్లో లబ్ది కోసం, అలాగే తమని కాదని కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన శివసేన సర్కార్ ని ఇరుకున పెట్టేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కార్ డ్రగ్స్ కేస్ ని లేవనెత్తింది అని చాలాకాలంగా విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అందులో నిజానిజాలు ఎలా ఉన్నా… సుశాంత్ మరణం కేసు గురించి ఇప్పుడు ఎవరూ మాట్లాడడం లేదు. బాలీవుడ్ లో నెపోటిజమ్ అన్న వివాదం పక్కకి వెళ్ళింది.
డ్రగ్స్ కేసులో కూడా అందరికి బెయిల్స్ వస్తున్నాయి.