సుశాంత్ కి రియా విషం ఇచ్చిందా?

రియా చక్రవర్తి తన కొడుక్కి విషం ఇచ్చిందని తాజాగా ఆరోపణలు చేశారు సుశాంత్ సింగ్ తండ్రి కేకే సింగ్. ఆయన ఒక వీడియో విడుదల చేశారు. రియా చాలా కాలంగా సుశాంత్ కి విషం ఎక్కించిందని అంటున్నారు ఆయన. వెంటనే రియాని అరెస్ట్ చెయ్యాలనేది కేకే సింగ్ డిమాండ్.

డ్రగ్ డీలింగ్ వ్యక్తులతో రియా చాలా కాలంగా టచ్ లో ఉందని ఈడీ పరిశోధనలో తేలిందట. ఇప్పుడు నార్కోటిక్ సంస్థ కేసు నమోదు చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో కేకే సింగ్ ఈ వీడియో ని రిలీజ్ చేసినట్లున్నారు. “రియా నా కొడుక్కి మెల్ల మెల్లగా విషం ఇంజెక్ట్ చేసింది. వెంటనే ఆమెని, ఆమె సహచరులని అరెస్ట్ చెయ్యాలని,” కేకే సింగ్ కోరుతున్నారు.

మరోవైపు, సిబిఐ ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ స్పీడ్ పెంచింది. ఢిల్లీ నుంచి నార్కోటిక్ బృందం కూడా ముంబైకి వచ్చి విచారణ మొదలు పెట్టింది.

Related Stories