మూడో భర్తని తరిమేసిన వనిత?

Vanitha Vijay Kumar wedding

తమిళ నటి వనిత విజయ్ కుమార్ ఇటీవల మూడో పెళ్లి చేసుకొంది. పీటర్ పాల్ అనే సినిమా ఇండస్ట్రీ వ్యక్తిని పెళ్లాడింది. ఐతే, అతను తన మొదటి భార్యకి విడాకులు ఇవ్వకుండానే వనితని పెళ్ళాడాడు అనే వివాదం ఇంకా అలాగే ఉంది. ఈ గ్యాప్ లోనే, ఆమె పీటర్ పాల్ ని ఇంటి నుంచి బయటికి పంపింది అని కోలీవుడ్ కొడైకొస్తోంది.

వనిత, తన పిల్లలతో కలిసి… ఈ కొత్త భర్తతో గోవా ట్రిప్ వేసింది. అక్కడ పీటర్ ఫుల్ గా తాగి నానా వీరంగం చేశాడట. చెన్నైకి వచ్చిన తర్వాత కూడా మందు మత్తులోనే కంటిన్యూ అయ్యాడని రూమర్స్.

అతని ఆల్కహాల్ అడిక్షన్ భరించలేక… పీటర్ ని తన్ని తరిమేసింది అని ఒక కోలీవుడ్ సెలబ్రిటీ ఇన్ స్టాగ్రామ్ లో నర్మగర్భంగా పోస్ట్ చేశాడు. దాంతో పుకార్లకు బలం వచ్చింది. ఇంతకీ … ఇందులో నిజమెంతో అనేది చూడాలి.

వనిత ఇంతకుముందు రెండు పెళ్లిళ్లు చేసుకొంది. ముగ్గురు పిల్లలు కలిగారు. 40 ఏళ్ల వనిత … మొన్న లాక్డౌన్ టైంలోనే మూడో పెళ్లి చేసుకొంది. ఒకనాటి ఫేమస్ హీరోయిన్ మంజుల, క్యారక్టర్ నటుడు విజయ్ కుమార్ రెండో కూతురు…వనిత.

Related Stories