
“అశోక వనంలో అర్జున కళ్యాణం” సినిమాలో రెండో హీరోయిన్ గా నటించి మంచి పేరు తెచ్చుకొంది రితిక నాయక్. ఆ సినిమాలో ఆమె హీరోయిన్ కాకపోయినా సినిమాలో హైలెట్ అయింది ఆమెనే. దాంతో ఈ భామకి తెలుగులో జోరుగా అవకాశాలు వస్తాయని అనుకున్నారు చాలామంది. కానీ ఆమెకి హీరోయిన్ గా మరో అఫర్ రాలేదు.
ఐతే, నాని నటించిన “హాయ్ నాన్న” చిత్రంలో మాత్రం చిన్న పాత్ర దక్కింది. ఆమె ఇందులో నానికి కూతురిగా నటించడం విశేషం.
“చిన్న పాత్ర అయినా ఓకే. పాత్రలో దమ్ము ఉంటే హీరోయిన్ గా అవకాశం వచ్చిందా, రెండో హీరోయిన్ గానా అన్నది చూడను. ‘హాయ్ నాన్న’లో చిన్న పాత్ర అయినా పెద్ద గుర్తింపు వచ్చింది కదా,” అని ఈ అమ్మడు చెప్తోంది.
రితిక నాయక్ వయసు 26 ఏళ్ళు. కానీ అలా కనిపించదు. అందుకే, ఆమెకి ఇంకా “హాయ్ నాన్న”లో చేసినటువంటి పాత్రలు దక్కుతున్నాయి. ఐతే, హీరోయిన్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. గ్లామర్, నటన రెండూ ఉన్న భామ.
ALSO READ: Ritika Nayak in her black outfit