
మనం రీతూ వర్మని అచ్చ తెలుగు అమ్మాయి అనుకుంటాం. తెలుగు చక్కగా మాట్లాడుతుంది. పుట్టింది, పెరిగింది హైదరాబాద్ లోనే. కానీ, తమ మూలాలు నార్త్ లో ఉన్నాయి అని చెప్తోంది ఈ భామ.
మా కుటుంబం ఉత్తరాది నుంచి ఇక్కడికి వలస వచ్చింది. కానీ నేను హైదరాబాద్ లో పుట్టి పెరగడం వాళ్ళ అందరూ పక్కా తెలుగమ్మాయి అనుకుంటారు. మా ఇంట్లో నార్త్, సౌత్ రెండూ కల్చర్స్ ఉంటాయి,” అని చెప్పింది రీతూ. “చిన్నప్పటి నుంచి బాలీవుడ్ సినిమాలు చూసి పెరిగాను. తెలుగు చిత్రాలు చూసింది కూడా తక్కువే. ఐతే, తెలుగు అంటే ఇష్టం.”
రీసెంట్ గా ఓటిటి ప్రాజెక్ట్ ఒకటి సైన్ చేసిందట. అమెజాన్ ప్రైమ్ కోసం వెబ్ సిరీస్ ఓకే చేశాను అని తెలిపింది. త్వరలోనే షూటింగ్ షురూ అవుతుందట.
వెబ్ సిరీస్ అంటే గ్లామర్ ఒలకబోయాలి, బోల్డ్ సీన్లు చెయ్యాలి కదా? “గ్లామర్ పాత్రలకు నేను వ్యతిరేకం కాదు. నాకు అలాంటి పాత్రలు రాలేదు. గ్లామర్ కి దూరం అని అనుకోవద్దు,” అని క్లారిటీ ఇచ్చింది.