- Advertisement -

కబడ్డీ గేమ్ ని మగవాళ్ళు ఆడుతారు. ఆడవాళ్లూ ఆడుతారు. టెన్నిస్ లో మిక్స్డ్ డబుల్స్ ఉన్నట్లు కబడ్డీలో ఆడ, మగ కలిసి ఆడడం ఉండదు.. లేడీస్ సెపరేట్, జెంట్స్ సెపరేట్. ఎందుకంటే… ఈ గేమ్ లో కూతకి వఛ్చినవాళ్ళని అవుట్ చెయ్యాలంటే…గట్టిగా ఒడిసిపట్టుకోవాలి. ఫిజికల్ టచ్ ఉండే గేమ్ ఇది.
ఇలాంటి గేమ్ ని మగాళ్ల జట్టుతో ఆడి అందర్నీ ఆశ్చర్యపరిచారు ఎమ్మెల్యే రోజా.
ఇటీవల ఆమె ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒక చోట కబడ్డీ ఆడుతున్న వారి దగ్గరికి వచ్చి వారిని ఉత్సహపరిచారు. అంతేకాదు… ఆమె కూడా వారితో కాసేపు సరదాగా ఆడారు. ఆమెని ‘అవుట్’ చేసేందుకు మాత్రం ఎవరూ సాహసం చెయ్యలేదు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది .