
ప్రముఖ నటి, రాజకీయనాయకురాలు రోజా ఇక టీవీ షోలు బంద్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆమెకి తాజా మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి దక్కింది. మంత్రి కావాలన్న ఆమె కల నెరవేరింది.
దాంతో, ఇకపై సినిమాలు, టీవీ షోలు చెయ్యను అని తెలిపారు.మంత్రిగా ఉండి సినిమాలు చెయ్యడం సరైన పద్దతి కాదు అనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారట. సీఎం జగన్ ఇచ్చిన గుర్తింపు ఎప్పటికీ మర్చిపోను అన్నారు.
రోజా బుల్లితెరపై బాగా పాపులర్. ఆమె టీవీ షోలో జడ్జిగా బాగా సంపాందించారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత కూడా షోలు కొనసాగించారు. ఐతే, మంత్రిపదవి అనేది ఫుల్ టైం జాబ్. సో, ఆమె వాటికి దూరమవుతున్నారు.
హీరోయిన్ గా అడుగుపెట్టి ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన రోజా మొదట తెలుగుదేశంలో ఉన్నారు. ఆ తర్వాత వైఎస్సార్సీ పార్టీలో చేరారు.
ALSO CHECK: At last, actress Roja becomes a minister