- Advertisement -

ప్రముఖ నటి, ఎమ్మెల్యే రోజాకి సర్జరీ జరిగింది. రెండు మేజర్ ఆపరేషన్లు జరిగాయని ఆమె భర్త ఆర్కే సెల్వమణి ఒక ప్రకటనలో చెప్పారు. చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో సర్జరీ జరిగినట్లు, ఆమెని ఐసియూ నుంచి జనరల్ వార్డ్ కి ఈ రోజు షిఫ్ట్ చేస్తారని అయన అన్నారు.
ఆమెకి ఏ ఆపరేషన్ జరిగింది అనే విషయంలో క్లారిటీ లేదు. ఐతే గతేడాది నుంచి ఆమె ఈ ఆపరేషన్లను వాయిదా వేసుకుంటూ వచ్చారట. కరోనా కారణంగా ఆలస్యం అయిన సర్జరీ ఇప్పుడు సక్సెస్ ఫుల్ గా జరిగిందని సెల్వమణి చెప్పారు.
ఒకప్పుడు అగ్ర హీరోయిన్ గా కొనసాగిన రోజా… ప్రస్తుతం రాజకీయనాయకురాలిగా పాపులర్ అయ్యారు. టీవీలో ‘జబర్దస్త్’ కార్యక్రమం జడ్జిగా మరింత పాపులారిటీ తెచ్చుకున్నారు.