మార్చి 11న ZEE 5 లో “రౌడీ బాయ్స్”

- Advertisement -
Rowdy Boys

జ‌న‌వ‌రి 14న థియేటర్లలో విడుదలైన మూవీ “రౌడీ బాయ్స్”. దిల్ రాజు ఇంటి నుంచి వచ్చిన హీరో ఆశిష్ తొలి చిత్రం ఇది. ఈ సినిమా మార్చి 11న ZEE5 లో స్ట్రీమ్ అవ్వబోతోంది.

ఆశిష్‌(నిర్మాత శిరీష్ త‌న‌యుడు) హీరోగా, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌ హీరోయిన్ గా నటించిన ‘రౌడి బాయ్స్’కి ‘శ్రీహ‌ర్ష కొనుగంటి దర్శకత్వం వహించారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాలో అనుపమ, ఆశిష్ మధ్య రొమాంటిక్ సన్నివేశాలు హైలైట్.

ప్రతినెలా సినిమాలు, వెబ్‌ సిరీస్‌ లు రిలీజ్‌ చేస్తూ దూసుకెళ్తోంది ZEE 5.

” ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, లూజర్, లూజర్ 2, మళ్లీ మొదలైంది, బంగార్రాజు వంటివి మా ZEE 5 లో విడుదలై పెద్ద విజయం సాధించాయి.వీటి ద్వారా ప్రేక్షకులకు ZEE 5 ఎంతో దగ్గరైంది. అలాగే చాలా రోజుల తర్వాత కాలేజ్ బ్యాక్ డ్రాప్‌లో వచ్చిన యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్ “రౌడి బాయ్స్” ఔట్ అండ్ ఔట్ కాలేజ్ సినిమా. యూత్ అందరు బాగా కనెక్ట్ అయ్యే ఈ సినిమాను థియేటర్ లో మిస్ అయిన వాళ్ళు , హాయిగా మీ కుటుంబ సభ్యులతో & స్నేహితులు అందరితో కలిసి ఈ సినిమా ని మార్చి 11 నుండి ZEE5లో ఎంజాయ్ చేయండి. ZEE5ని సబ్‌స్క్రైబ్ చేసుకొని వారుంటే వెంటనే ZEE5ని డౌన్‌లోడ్ చేసి సబ్‌స్క్రైబ్ చేసుకోండి,” అని ZEE5 ఒక ప్రకటనలో తెలిపింది.

 

More

Related Stories