‘అర్.అర్.అర్’పై మరో రూమర్

RRR

‘అర్.అర్.అర్’ సినిమా షూటింగ్ జోరుగా సాగుతోంది. ఈ మూవీ షూటింగ్ లో ఇంతవరకు అలియా భట్ చేరలేదు. ఆమె డిసెంబర్ లో జాయిన్ అవుతుంది. ఐతే, ఈ సినిమాకి పోస్ట్-ప్రొడక్షన్ కి సంబంధించి ఊహాగానాలు అప్పుడే మొదలయ్యాయి. ఈ సినిమాని వివిధ భాషల్లో పెద్ద స్టార్స్ వాయిస్ ఓవర్ ఇస్తారు అనేది లేటెస్ట్ రూమర్.

అమీర్ ఖాన్ హిందీ వర్షన్ కి వాయిస్ ఓవర్ ఇస్తాడని అప్పుడే ప్రచారం మొదలైంది. అమీర్ ఖాన్, రాజమౌళికి మధ్య మంచి స్నేహం ఉన్న మాట వాస్తవమే. కానీ, అప్పుడే ఈ సినిమా వాయిస్ ఓవర్ గురించి మాట్లాడడం టూ ఎర్లీ. మరో ఆర్నెళ్ల తర్వాత దాని గురించి నిర్ణయం తీసుకుంటారేమో.

ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రూపొందుతోన్న ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాని హిందీ, తెలుగు, తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ చేస్తారు. ఈ సినిమాలో అజయ్ దేవగన్, అలియా భట్ వంటి బాలీవుడ్ స్టార్స్ ఉన్నారు.

More

Related Stories