ఆర్ఆర్ఆర్ అయింది.. ఎస్ఎస్ఎస్ చూడండి

తన మేజర్ సినిమాను ఆర్ఆర్ఆర్ తో లింక్ పెట్టాడు హీరో అడివి శేష్. ఆర్ఆర్ఆర్ మేనియా అయిపోయిందని, ఇక ఇప్పుడు ఎస్ఎస్ఎస్ చూడండని చెబుతున్నాడు. ఇంతకీ ఎస్ఎస్ఎస్ అంటే అర్థం ఏంటో తెలుసా?

శోభిత, శేష్, సయీ.. ఇలా వీళ్లు ముగ్గురూ కలిసి చేసిన సినిమా మేజర్. అందుకే ఈ సినిమాను ఎస్ఎస్ఎస్ అంటున్నాడు శేష్. సరిగ్గా ఆర్ఆర్ఆర్ కు కూడా ఇలానే పేరు పెట్టాడు రాజమౌళి. రామారావు, రామ్ చరణ్, రాజమౌళి పేర్లు కలిసొచ్చేలా ఆర్ఆర్ఆర్ గా నామకరణం చేశాడు. ఆ స్టయిల్ ను ఫాలో అవుతూ.. మేజర్ కు ఎస్-ఎస్-ఎస్ అంటూ కొత్త పేరు పెట్టాడు శేష్.

ఈరోజు థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు హిట్ టాక్ వచ్చింది. సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఎమోషనల్ గా కనెక్ట్ అవుతున్నారు. ప్రొడక్షన్ వాల్యూస్, శేష్ నటన, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుందని అంతా మెచ్చుకుంటున్నారు. అందుకే ఈ సినిమాను ఆర్ఆర్ఆర్ రేంజ్ లో పాన్ ఇండియా సినిమాగా హిట్ చేయాలని, అప్పుడు దీనికి ఎస్-ఎస్-ఎస్ అని పేరు పెడతామంటున్నాడు శేష్. 

 

More

Related Stories