ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోసమే!

NTR

జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల కోసమే రాజమౌళి “ఆర్.ఆర్.ఆర్” సినిమాకి సంబంధించి కొత్త షెడ్యూలు మొదలుపెట్టారు. మార్చ్ 27న రామ్ చరణ్ బర్త్ డే నాడు…. ఒక టీజర్ విడుదల అయింది. అది రామ్ చరణ్ క్యారక్టర్ ని తెలిపే వీడియో. అలాగే మే 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా కూడా టీజర్ వస్తుంది అని అనుకున్నారు నందమూరి ఫ్యాన్స్. ఐతే… లాక్డౌన్ కారణంగా రాజమౌళి విడుదల చెయ్యలేకపోయారు.

ఏడు నెలల గ్యాప్ తర్వాత “ఆర్.ఆర్.ఆర్” షూటింగ్ మళ్ళీ మొదలైంది. ఇప్పుడు చిత్రీకరించే సీన్లతో టీజర్ రిలీజ్ రూపొందిస్తారట. సో.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోసమే ఈ కొత్త షెడ్యూల్ మొదలు పెట్టినట్లు అయింది అన్నమాట.

“ఆర్.ఆర్.ఆర్”లో ఎన్టీఆర్ కొమరం భీం పాత్ర పోషిస్తున్నాడు. 1920 నేపథ్యంగా సాగే కథ. ఎన్టీఆర్ పోషిస్తున్న కొమరం భీం, రామ్ చరణ్ నటిస్తున్న అల్లూరి సీతారామరాజు పాత్రలు నిజమైనవే. ఐతే, ఈ సినిమా కథ మాత్రం కల్పితం. పాత్రలు నిజం… కథ నిజం కాదు.

రాజమౌళి ఏంటో ప్రతిష్టాత్మకంగా తీస్తున్న “ఆర్.ఆర్.ఆర్”లో ఎన్టీఆర్ సరసన బ్రిటిష్ భామ ఒలివియా మోరిస్ నటిస్తోంది. రామ్ చరణ్ సరసన అలియా భట్ నటించనుంది. అలియా త్వరలోనే షూటింగ్లో జాయిన్ అవుతుంది.

Related Stories