మొదటి పాటే సూపర్ హిట్

- Advertisement -


“ఆర్ ఆర్ ఆర్” నుంచి విడుదలైన మొదటి పాట సూపర్ హిట్టైంది. “దోస్తీ” పేరుతో తెలుగులో, రకరకాల పేర్లతో మిగతా నాలుగు భాషల్లో (తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ) విడుదలైన ఈ సాంగ్ అనుకున్నట్లే వైరల్ అయింది. రాజమౌళి – కీరవాణి కాంబినేషన్ లో వచ్చే పాటలకు ఉండే క్రేజ్ వేరు కదా. పైగా ఫస్ట్ సాంగ్. అందుకే… యూట్యూబ్ లో తెగ ట్రెండింగ్ అవుతోంది.

“దోస్తీ” పాట హిట్ కావడంతో ఈ సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి. రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్ అని ప్రకటించిన టైంలోనే అంచనాలు ఆకాశానికి అంటాయి. ఇప్పుడు, ఈ పాటతో ఇంకా మరింత పెరిగాయి.

ఈ సినిమా ఆడియో రైట్స్ ని టీ సిరీస్ కొనుక్కొంది. దాదాపు 25 కోట్లు ఇచ్చారని ఒక టాక్. కాదు, 13 కోట్లు అనేది మరో మాట.

 

More

Related Stories