223 కోట్ల పోస్టర్ వదిలారు!

- Advertisement -


రాజమౌళి తీసిన ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 223 కోట్ల రూపాయల (గ్రాస్) వసూళ్లు అందుకొందని నిర్మాణ సంస్థ ప్రకటించింది. అధికారికంగా పోస్టర్ వదిలారు. మొదటి రోజు కలెక్షన్ల మొత్తం 223 కోట్లు అంటూ పోస్టర్ ని ప్రముఖ బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ షేర్ చేశారు. ఇది అఫీషియల్ పోస్టర్ అని ఆయన ట్వీట్ చెయ్యడం విశేషం.

రెండో రోజు కూడా వసూళ్ల ట్రెండ్ గట్టిగానే ఉంది. ఇలాంటి భారీ సినిమాకి ఆదివారం కలెక్షన్లు ఇంకా ఎక్కువగా ఉంటాయి. అంటే మొదటి వీకెండ్ కి ఒక 600 కోట్ల రూపాయల గ్రాస్ పోస్టర్ ని చూడొచ్చు.

రాజమౌళి తీసిన ఈ భారీ చిత్రం వసూళ్ల పరంగా కొత్త రికార్డులు సృష్టించింది అని తొలి రోజు కలెక్షన్లు (నిజమైన వసూళ్లు అయినా, పోస్టర్ వసూళ్లు అయినా) చెప్తున్నాయి. అందులో సందేహం లేదు. మరి ఈ సినిమా ఇంకా మున్ముందు ఎన్ని రికార్డులు నెలకొల్పుతుంది అనేది ఆసక్తికరంగా ఉంది.

ఐతే, ఫ్యామిలీస్ థియేటర్ల వైపు వస్తారా? అన్న మొన్నటివరకు ఉన్న సందేహాలు ఈ సినిమాతో పటాపంచలు అయ్యాయి. టికెట్ రేట్లు భారీగా పెంచినా ప్రజలు పట్టించుకోవడం లేదు… పెట్రోల్ రేట్ల పెంపు విషయంలో నోర్ముసుకొని కూర్చున్నట్లు. సో…. ఏ విధంగా చూసినా రాజమౌళి మరోసారి అందరిని థియేటర్ల బాట పట్టించారు. కోవిడ్ కి ముందున్న ఊపుని రాజమౌళి తెలుగుసినిమాకి తీసుకొచ్చారు. రాజామౌళికి డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల ఓనర్లు ఎప్పటికీ రుణపడి ఉండాలి.

 

More

Related Stories