
‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా అమెరికాలో బాగా ఆడుతోంది. అమెరికాలోనే కాదు యూకేలో, ఆస్ట్రేలియాలో కూడా అలాగే ఉంది. హాలీవుడ్ సినిమాల స్థాయిలోనే వసూళ్లు అందుకుంటోంది ఈ మూవీ.
అమెరికాలో ఈ సినిమా మంగళవారం కలెక్షన్లతో 10 మిలియన్ల మార్క్ దాటింది.
బాహుబలి 2 సినిమాకి అమెరికాలో 20 మిలియన్ల వసూళ్లు వచ్చాయి. ఆ సినిమా స్థాయిలో దీనికి రావు అనేది అందరికి తెలిసిందే. ఐతే, ఇంకా నాలుగు, ఐదు మిలియన్ల డాలర్ల వసూళ్లు అందుకునే అవకాశం మాత్రం ఉంది. ఇప్పటివరకు 12 మిలియన్ల వసూళ్లకు మించి (దంగల్, పద్మావత్) అందుకున్న భారతీయ సినిమా ఒక్కటే. అదే ‘బాహుబలి 2’. సో, అమెరికాలో అత్యధిక వసూళ్లు అందుకున్న రెండో భారీ భారతీయ హిట్ చిత్రం కూడా రాజమౌళి తీసిన మూవీనే కానుంది.
రాజమౌళి సినిమాలకు ఉన్న క్రేజ్ వేరు అని మరోసారి అర్థమైంది. ఆయన సినిమాల్లో సహజంగా ఉండే ఎమోషనల్ గ్రిప్, కథాబలం ఇందులో లేవు. రాజమౌళి తీసిన సినిమాల్లో దీనికి వచ్చిన మార్కులు తక్కువ. ఐతే, హీరోల నటన, భారీతనం, కొన్ని గ్రిప్పింగ్ సీన్లు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఆయన మేజిక్ మరోసారి ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద బాగా పనిచేసింది.