
“ఆర్ ఆర్ ఆర్” సినిమా కథకి సోల్ అంతా ఒక పాటలో ఉందంట. “జనని” అనే పాట ఈ సినిమా కథని, కథలోని ఆత్మని పట్టి చూపుతుందట. సంగీత దర్శకుడు కీరవాణి సినిమా సోల్ ని పట్టుకొని మ్యూజిక్ ఇవ్వడంలో దిట్ట. “పెద్దన్న స్వరపర్చిన భావోద్వేగ ‘జనని’ పాట RRR కథలోని హృదయాన్ని చూపించే కిటికీ. ఈ నెల 26న విడుదలవుతోంది ఈ పాట. సిద్ధంగా ఉండండి,” అంటూ రాజమౌళి కొత్త పోస్టర్ ని విడుదల చేశారు.
ఇంతకుముందు ఈ సినిమా నుంచి “దోస్తీ”, “నాటు నాటు” పాటలు వచ్చాయి. “జనని” మూడో పాట. ఐతే, “నాటు నాటు” సాంగ్ మాత్రమే వైరల్ అయింది ఇప్పటివరకు.
ఎన్టీఆర్, రామ్‌చరణ్ కథానాయకులుగా నటిస్తోన్న మూవీ ఇది. అజయ్ దేవగన్ మరో కీలక పాత్రధారి. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.
దానయ్య నిర్మిస్తోన్న ఈ మూవీ మరోసారి బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తుంది అని అంటున్నారు.