ఇంకా ఛాన్స్ ఉంది కానీ!

NTR, Rajamouli, Ram Charan

రాజమౌళి తీసిన ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాకి ఆస్కార్ అవకాశాలు సన్నగిల్లాయి. ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరిలో ప్రతి దేశం తమ దేశం తరఫున ఒక సినిమాని పంపించాలి. మన దేశం తరఫున ‘చెల్లో ఛాన్స్’ అనే గుజరాతీ సినిమాని పంపిస్తున్నారు. “ఆర్ ఆర్ ఆర్”, “ది కాశ్మీర్ ఫైల్స్” వంటి పలు చిత్రాలను పరిశీలించిన ఇండియన్ కమిటీ గుజరాతీ చిత్రాన్ని సెలెక్ట్ చేసింది.

ఇక ‘ఆర్ ఆర్ ఆర్’కి పూర్తిగా దారులు మూసుకు పోయినట్లేనా? ఈ ప్రశ్న అందరిలో కలుగుతోంది. మామూలు పరిస్థితుల్లో ఐతే విదేశీ చిత్రాలకు ఇంతకుమించి అవకాశం ఉండదు.

ఐతే, ఇటీవల ఆస్కార్ అవార్డుల కమిటీ తన పంథాని మార్చింది. కేవలం విదేశీ చిత్రం కేటగిరీలోనే కాకుండా ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు వంటి మెయిన్ కేటగిరీల్లోకి విదేశీ చిత్రాలను సెలెక్ట్ చేస్తోంది. గ్లోబల్ సినిమాకి మరింత ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో గత ఐదారేళ్లుగా నిబంధనలను సడలించింది. జ్యురిలోకి ఇండియన్, కొరియన్, జపాన్, హాంకాంగ్, చైనీస్, ఇలా పలు దేశాలకు చెందిన సినిమా సెలబ్రిటీలను ఎంపిక చేస్తోంది.

అందుకే, ఇటీవల ‘పారసైట్’ అనే కొరియన్ చిత్రం ఏకంగా ఉత్తమ చిత్రంతో పాటు పలు అవార్డులు కొల్లగొట్టి కొత్త చరిత్ర సృష్టించింది.

సో, ‘ఆర్ ఆర్ ఆర్’ మెయిన్ కేటగిరీల్లో సెలెక్ట్ కావాలంటే ఆస్కార్ అవార్డు జ్యురిలో ఉన్న ఎక్కువశాతం మందికి నచ్చాలి. దానికోసం బాగా పబ్లిసిటీ చెయ్యాలి. రాజమౌళి ఎలాగూ మార్కెటింగ్లో, పబ్లిసిటీలో కింగ్ కాబట్టి ఆయన ఆ దిశగా ప్రయత్నాలు చేస్తారనుకోవచ్చు. ఇంకా ఛాన్స్ ఉంది. కానీ అవకాశాలు మాత్రం కొంచెం తక్కువ!

 

More

Related Stories