RRRకి ఇంకో R జత!

- Advertisement -
Rajamouli, NTR, Ram Charan, Alia Bhatt

రాజమౌళి తీసిన “RRR”కి సంబందించిన ప్రమోషనల్ ఈవెంట్ ఆదివారం (డిసెంబర్ 19) ముంబైలో భారీ ఎత్తున జరగనుంది. సల్మాన్ ఖాన్ ముఖ్య అతిథిగా రానున్నారు. ఒకప్పుడు రాజమౌళి హైదరాబాద్ లో ఎలాంటి కార్యక్రమాలు చేసేవారో అవి ఇప్పుడు ముంబై వాళ్లకు రుచి చూపిస్తున్నారు.

బాహుబలికి ముందు వరకు… ప్రీ రిలీజ్ ఈవెంట్ లలో, ఆడియో ఫంక్షనులలో కీరవాణితో ఫన్నీ ఇంటర్వ్యూలు, ఏవేవో కామెడీ స్కిట్లు వేయిస్తుండేవారు. ఇప్పుడు ముంబైలో “ఫిల్టర్ కాఫీ విత్ కరణ్” (FilteRRR Coffee with Karan) అనే అలాంటిదే ఒకటి చెయనున్నారట.

ఇక హైదరాబాద్ లో కూడా ఒక భారీ ఈవెంట్ జరగనుంది. ఈ నెలాఖరులో రామోజీ ఫిలిం సిటీ(RFC)లో ఈ ఈవెంట్ ని నిర్వహిస్తారట. అంటే ఈ సినిమాకి ఇంకో ‘R’ (RFC) జత చేరింది. రాజమౌళి ఇప్పుడు ఇండియన్ సినిమాలో ఒక బ్రాండ్ నేమ్. బాలీవుడ్ మేకర్స్, స్టార్స్ కూడా రాజమౌళి ప్రతిభకి సలామ్ కొడుతున్నారు. మార్కెట్ లోనూ, ప్రేక్షకుల్లోనూ ఆయనకున్న క్రేజ్ వేరు. అమెరికాలో అప్పుడే ఈ సినిమా టికెట్ల బుకింగ్ మొదలైందట. ప్రీమియర్ షోకి భారీగా టికెట్లు అమ్ముడుపోతున్నాయట.

సినిమా గొప్పగా తీయడమే కాదు…. మార్కెటింగ్ చేసుకోవడంలో, క్రేజ్ ని నిలుపుకోవడంలో రాజమౌళి శైలి వేరు.

 

More

Related Stories