అందరూ తల పట్టుకున్నారు!

RRR

రాజమౌళి సినిమా అంటే… అంతే. మొదలు అయిన తర్వాత ఎప్పుడు ముగుస్తుందో ఎవరు చెప్పలేరు. రాజమౌళికి కూడా తెలీదు. ఆయన గ్రాండ్ విజన్ కి తగ్గట్లు సినిమా వచ్చేంతవరకు తీస్తారు. డెడ్ లైన్ పాటించడం కన్నా అనుకున్నది తియ్యడం ముఖ్యం అనుకునే దర్శకుడు ఆయన. మగధీర, బాహుబలి, ఈగ… ఇలా అన్ని లేట్ అయినవే. కానీ అన్ని మెగా బ్లాక్ బస్టర్స్.

ఐతే, ఇప్పుడు కరోనా వల్ల రాజమౌళి చాలా ఇబ్బంది పడుతున్నట్టు ఉన్నారు. రాజమౌళితో పాటు ఇతర దర్శకులకు కూడా టెన్షన్ ఉంది. ముఖ్యంగా కొరటాల శివ, త్రివిక్రమ్ కి ఉన్న టెన్షన్ అంతా ఇంతా కాదు. రామ్ చరణ్ … “ఆచార్య”లో గెస్ట్ రోల్ చేస్తున్నారు. రామ్ చరణ్ తో షూటింగ్ మొదలు పెట్టాలంటే… “ఆర్.ఆర్.ఆర్” విషయంలో కార్లిటి రావాలి. ఎన్టీఆర్ మేటర్ కూడా సేమ్.

త్రివిక్రమ్ తన కొత్త సినిమా షూటింగ్ మొదలుపెట్టాలంటే… “ఆర్.ఆర్.ఆర్” షూటింగ్ కంప్లీట్ చేసుకొని ఎన్టీఆర్ బయటికి రావాలి. మరి “ఆర్.ఆర్.ఆర్” ఎప్పుడు పూర్తి అవుతుంది? అదే తేలిక అందరూ జుట్టు పీక్కుకుంటున్నారు. రాజమౌళి చేతిలోనే అంతా ఉంది.

Related Stories