
“ఆర్.ఆర్.ఆర్” సినిమా షూటింగ్ జోరుగా సాగుతోంది. ఇంకా హీరోయిన్ అలియా భట్ వచ్చి షూటింగ్ లో చేరలేదు. అంటే, చాలా షూటింగ్ పార్ట్ మిగిలి వుంది. ఐతే, ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చిలో షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టాలని రాజమౌళి పట్టుదలగా ఉన్నారట. దానికి కారణం… రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరికి వేరే కమిట్ మెంట్స్ ఉన్నాయి. రాజమౌళి కారణంగా వాళ్ళు వేరే సినిమాలకు డేట్స్ ఇవ్వడం లేదు.
రాజమౌళి మేకింగ్ విషయంలో రాజీ పడే ఛాన్స్ లేదు. ఆయన ఈ రోజు ఇండియాలో నంబర్ వన్ డైరక్టర్ గా నిలవడానికి కారణం అదే – పెర్ఫెక్షన్. బెస్ట్ వచ్చిందని తనకు అనిపించేంత వరకు షూటింగ్ చేస్తూనే ఉంటారు. అలాగని, ఎన్టీఆర్, రామ్ చరణ్ లను మరిన్ని నెలలు తన సినిమాకే ఆక్యుఫై చెయ్యడం ఇష్టం లేదు. అందుకే మార్చిలో షూటింగ్ పార్ట్ వరకు గుమ్మడికాయ కొడుతారు. ఆ తర్వాత పోస్ట్-ప్రొడక్షన్ పనులు జరుగుతాయి.
ఇప్పటివరకు రాజమౌళి ప్లాన్ ఇది. మార్చి నెల తర్వాత రామ్ చరణ్ “ఆచార్య” సినిమా షూటింగ్లో పాల్గొంటాడు. ఎన్టీఆర్ – త్రివిక్రమ్ సినిమా సమ్మర్లోనే మొదలవుతుంది.