జపాన్ వెళ్లనున్న జక్కన్న

- Advertisement -
RRR

రాజమౌళి సినిమాలకు జపాన్ లో మంచి క్రేజ్ ఉంది. బాహుబలి మొదటిభాగం, రెండో భాగం మంచి విజయం సాధించాయి. అక్కడి అభిమానులు కొందరు హైదరాబాద్ వచ్చి ప్రభాస్ ని కలిసి వెళ్లారు. ఇప్పుడు ‘ఆర్ ఆర్ ఆర్’ని కూడా జపాన్ లో విడుదల చెయ్యనున్నారు.

మార్కెటింగ్ లో జక్కన్న కింగ్ కదా. జపాన్ మార్కెట్ పై దృష్టి పెట్టి అక్కడ హైప్ తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. అక్టోబర్ 21 న జపాన్లో విడుదల చేసేందుకు “ఆర్ ఆర్ ఆర్” మూవీ టీం అన్ని ఏర్పాట్లు చేసింది.

విడుదల టైంలో తాను జపాన్ కి రానున్నట్లు ఒక వీడియో ద్వారా రాజమౌళి వెల్లడించారు. బాహుబలి సినిమాలను ఎలా ఆదరించారో ఈ సినిమాని కూడా ఆదరించాల్సిందిగా రాజమౌళి జపాన్ ప్రేక్షకులను కోరారు.

మరోవైపు, “ఆర్ ఆర్ ఆర్” సినిమాని ఆస్కార్ రేస్ లో ఉంచేందుకు హాలీవుడ్ ఏజెన్సీ CAA ప్రయత్నిస్తోంది. ఈ సంస్థతో ఇటీవలే రాజమౌళి ఒప్పందం చేసుకున్నారు. మరి రాజమౌళి ప్రయత్నాలు ఫలించి ఈ సినిమా ఆస్కార్ బరిలో నిలిస్తే ఇండియాకి గర్వకారణమే. చూద్దాం ఏమి జరుగుతుందో.

More

Related Stories