
తాజా పరిణామాలను బట్టి చూస్తే రాజమౌళి RRR సినిమాని ఈ ఏడాది దసరాకే విడుదల చెయ్యాలని పట్టుదలగా ఉన్నట్లు కనిపిస్తోంది. షూటింగ్ చివరి దశకు చేరుకొంది. గ్రాఫిక్స్ కూడా దాదాపుగా పూర్తి అయ్యాయి. అయితే, అసలు సమస్య దేశమంతా థియేటర్లు ఓపెన్ కావాలి, మళ్ళీ థర్డ్ వేవ్ వంటి కరోనా భయాలు ఉండకూడదు.
రాజమౌళి ఈ విషయంలో క్లారిటీకి వచ్చినట్లు కనిపిస్తోంది. దేశమంతా థియేటర్లు త్వరలోనే తెరుచుకుంటాయి. ఇక అమెరికాలో థియేటర్లు నడుస్తున్నాయి. ఈ గ్యాప్ లో పలు తెలుగు, హిందీ, సినిమాలు కూడా విడుదల కానున్నాయి. సో… అన్ని పెర్ఫెక్ట్ గా సాగితే, ముందు ప్రకటించిన అక్టోబర్ 13 డేట్ కే RRR వచ్చే అవకాశాలు మెరుగయ్యాయి.
ఇప్పుడే పక్కాగా చెప్పలేం కానీ ప్రస్తుతం రాజమౌళి అండ్ టీం దూకుడు చూస్తేంటే అదే డేట్ కి (అక్టోబర్ 13, 2021) సినిమాని విడుదల చేసేలా ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి అని చెప్పొచ్చు.
ఈ సినిమాలో హీరోలుగా నటించిన రామ్ చరణ్, ఎన్టీఆర్ లు కూడా తమ కొత్త సినిమాల షూటింగ్స్ కి రెడీ కానున్నారు. ఎన్టీఆర్ ఇప్పటికే కొరటాల శివ సినిమా ఒప్పుకున్నారు. రామ్ చరణ్ దర్శకుడు శంకర్ తీసే మూవీలో పాల్గొంటారు.