ట్రైలర్ ముందు థియేటర్లోనే

RRR Trailer


“ఆర్ ఆర్ ఆర్” సినిమా ట్రైలర్ కోసం అభిమానులు ఎన్నాళ్ళుగానో ఎదురుచూస్తున్నారు. రేపే విడుదల కానుంది. ఐతే, ట్రైలర్ అందరి కన్నా ముందు చూడాలంటే థియేటర్లలోకి వెళ్ళాలి. ఈ సినిమా ట్రైలర్ ను డిసెంబర్ 9న తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 300 థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు.

గురువారం ఉదయం 10 గంటలకు థియేటర్లలో ప్రదర్శితం అవుతుంది. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు అందరికి చూపిస్తారు. అదేనండి. అదే యూట్యూబ్ లో 4 గంటలకు వస్తుంది.

రాజమౌళి సినిమాలు థియేటర్లో చూస్తేనే కిక్కు. అందుకే, ట్రైలర్ ని కూడా ముందుగా థియేటర్లో చూపిస్తున్నారు జక్కన్న. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు కొత్తగా ఉంటాయట. రాజమౌళి సినిమా అంటేనే కళ్ళు చెదిరే విజువల్స్, గ్రాఫిక్స్. “ఆర్ ఆర్ ఆర్” సినిమాని ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ సినిమాగా అభివర్ణిస్తున్నారు. విజువల్స్, ఫైట్స్ నభూతో అన్నట్లు ఉన్నాయని ఆల్రెడీ చూసినవారి మాట.

ఇక కీరవాణి నేపథ్య సంగీతం మరోసారి కొత్త పుంతలు తొక్కిందట.

Advertisement
 

More

Related Stories