RRR సక్సెస్ కి హద్దు లేదు

Naatu Naatu song

‘బాహుబలి’ సినిమా దాదాపు 500 కోట్ల రూపాయలు కొల్లగొట్టింది. ‘బాహుబలి 2’ వసూళ్లు దాదాపు 1800 కోట్లు. అది రాజమౌళి సత్తా. భారతీయ సినిమా బాక్సాఫీస్ లెక్కలు మార్చేసిన సినిమా …బాహుబలి. మరి అంతటి ఘన విజయం తర్వాత రాజమౌళి తీస్తున్న మూవీ… ‘ఆర్ ఆర్ ఆర్’. సహజంగానే ఈ సినిమా కూడా బాహుబలి’ని మించి ఆడుతుందని ఎవరైనా అంచనా వేస్తారు.

కానీ, కరోనా కారణంగా అందరి అంచనాలు తప్పాయి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంత వసూల్ చేయగలదో ఎవరూ ఇప్పుడు అంచనాకట్టలేరు అని ట్రేడ్ పండితుల మాట. “ఆర్ ఆర్ ఆర్” బాక్సాఫీస్ విజయాన్ని బట్టి తెలుగు, హిందీ చిత్రాల మార్కెట్ ని ఇప్పుడు కొత్తగా లెక్కలు కట్టాల్సి ఉంటుంది. ఐతే, ఈ సినిమాకి మాటల రచయితగా పనిచేసిన బుర్రా సాయి మాధవ్ మాత్రం ‘బాహుబలి’కి మించి ఆడుతుందన్నట్లుగా చెప్తున్నారు.

“RRR అనే దానికి హద్దులు లేవు. అంత పెద్ద హిట్ అవుతుంది. అందులో సందేహమే లేదు. రాజమౌళి గారు కథ చెప్పినప్పుడే దీని విజయాన్ని ఊహించాను. సినిమా చూస్తుంటే Goosebumps వస్తాయి అంతే. అది ఒక అద్భుతం. ఆ సినిమాకి ఎల్లలు లేవు అంత పెద్ద విజయం సాధిస్తుంది,” అని సాయిమాధవ్ ఘంటాపథంగా చెప్తున్నారు.

ఆయన మాట నిజమైతే నిర్మాత దానయ్య, డిస్ట్రిబ్యూటర్లు, సినిమా లవర్స్, ఫ్యాన్స్ అందరూ పండగ చేసుకుంటారు. ఆయన అంచనా నిజం కావాలని కోరుకుందాం.

ఐతే, కరోనా తర్వాత పరిస్థితుల్లో మరీ ఓవర్ అంచనాలు పెట్టుకోకుండా ఉంటేనే బెటర్.

Advertisement
 

More

Related Stories