ఆర్ఆర్ఆర్ కు రూ.100.. కేజీఎఫ్ కు రూ.199

ఓ పెద్ద సినిమా థియేటర్లలోకి వచ్చినప్పుడు టికెట్ రేట్ పెంచడం ఈమధ్య కాలంలో కామన్ అయిపోయింది. విడుదలైన తొలి వారం రోజులు లేదా తొలి 10 రోజులు ఇలా ప్రత్యేక అనుమతులతో టికెట్ రేట్లు పెంచుకుంటున్నారు సినీ జనాలు. మేం ఎందుకు తగ్గాలి అనుకుంటున్నారో ఏమో, ఓటీటీ కంపెనీలు కూడా ఈ పద్ధతిని ఫాలో అయిపోతున్నాయి. ఓ పెద్ద సినిమా స్ట్రీమింగ్ కు పెట్టినప్పుడు ఎక్స్ ట్రా ఛార్జ్ లు పెడుతున్నాయి.

కేజీఎఫ్2 సినిమా స్ట్రీమింగ్ కు వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో ఉన్న ఈ సినిమా చూడాలనుకుంటే, కేవలం సబ్ స్క్రిప్షన్ ఉంటే సరిపోదు. అదనంగా 199 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అలా పే పర్ వ్యూ మోడల్ లో సినిమాను దించింది అమెజాన్. దీనికి రెంటల్ (అద్దె) అనే పేరు పెట్టింది. కొన్నాళ్ల తర్వాత సబ్ స్క్రైబర్లు అందరికీ ఓపెన్ చేసి పెడుతుందంట.

ఆర్ఆర్ఆర్ సినిమా పరిస్థితి కూడా ఇదే. జీ5లో 20వ తేదీన ఈ సినిమా స్ట్రీమింగ్ కు వస్తోంది. ఈ మూవీ చూడాలంటే సబ్ స్క్రిప్షన్ తో పాటు అదనంగా 100 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.

ఇలా ఓటీటీ సంస్థలు కూడా పెద్ద సినిమాల్ని స్ట్రీమింగ్ కు పెట్టినప్పుడు ప్రత్యేక చార్జీలు పెడుతున్నాయి. ఈ ట్రెండ్ ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందో చూడాలి. చూస్తుంటే.. రాబోయే రోజుల్లో పెద్ద సినిమాలన్నింటికీ ఓటీటీలో కూడా కొన్ని రోజుల పాటు అదనపు వడ్డింపులు తప్పేలా లేవు.

Advertisement
 

More

Related Stories