
తెలుగుజాతికి గర్వకారణం..తరతరాల నిండుగౌరవం “రుద్రమదేవి కథ అత్యంత ప్రతిష్టాత్మక ధారావాహికగా అందిస్తోంది తెలుగువారి అభిమాన ఛానల్ స్టార్ మా.
కథల్లో కొత్తదనం తొణికిసలాడే ప్రయోజనం, ధైర్యసాహసాలతో ముందుకు దూసుకెళ్లే మనుషుల జీవితాల్ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసే ప్రయోగాలతో ఎప్పుడూ కొత్తదనాన్ని నిరూపిస్తూ వస్తున్న స్టార్ మా ఇప్పుడు ఓ చారిత్రక సువర్ణాధ్యాయాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. దశాబ్హాలనాటి ఈ కథ ఇప్పుటికీ కొత్తగా అనిపించడం, ఎందరికో ప్రేరణ ఇవ్వడం ప్రత్యేకతలుగా గల “రుద్రమదేవి’ కథ నేరుగా తెలుగు ప్రేక్షకుల కోసం రూపుదిద్దుకుంది.
స్టార్ మా ఈ అపురూపమైన అసమానమైన ప్రయత్నంలో సాంకేతికంగా ఒక అద్భుతాన్ని ఆవిష్కరించే ప్రయత్నంచేస్తోంది. బుల్లితెరపై మొట్టమొదటిసారిగా సరికొత్త స్టాండర్డ్‌లో, ఆ అద్భుతాన్ని మరపురాని స్థాయిలో సృజనాత్మకంగా తీర్చిదిద్దింది. ఈ భారీ ప్రాజెక్ట్ రుద్రమదేవి” స్టార్ మా లో జనవరి 18 నుంచి రాత్రి 9 గంటలకు ప్రసారమవుతుంది.
ఎప్పటికీ గుర్తుండే ఈ ‘రుద్రమదేవి కథ..ఎప్పటికీ గుర్తుండే ధారావాహికలా తెలుగిళ్లలో వినోదానికి ఓ సరికొత్త నిర్వచనాన్ని ఇవ్వబోతోంది. స్టార్ మా ఈ సీరియల్‌ని తమ ప్రేక్షకులకు అపురూపమైన కానుకగా సమర్పిస్తోంది.
రద్రమదేవి ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
Press release by: Indian Clicks, LLC