- Advertisement -

రుక్మిణి వసంత్… బెంగుళూర్ భామ. కన్నడ సినిమా “సప్తసాగరాలు దాటి” అనే చిత్రంతో రుక్మిణి పాపులర్ అయింది. “సైడ్ ఏ”, “సైడ్ బి” అని రెండు భాగాలుగా విడుదలైన ఆ చిత్రాలు తెలుగులో కూడా డబ్ అయ్యాయి కానీ అవి ఆడలేదు. ఐతే, రుక్మిణి అందం, అభినయం ఆకట్టుకొంది.
దాంతో, తెలుగులో ఆమెని నటింపచెయ్యాలని పలువురు దర్శకులు భావిస్తున్నారు. విజయ్ దేవరకొండ కొత్త సినిమాలో ఈ భామ పేరు కూడా పరిశీలనకు వచ్చింది. మనవాళ్ళు ఇంకా ఆలోచిస్తుండగానే తమిళ దర్శక, నిర్మాతలు ఆమెని అక్కడ పరిచయం చేస్తున్నారు.
తమిళ యువ హీరో శివ కార్తికేయన్ సరసన రుక్మిణి ఇప్పుడు ఛాన్స్ కొట్టేసింది.
ఈ సినిమాకి మురుగదాస్ దర్శకుడు. ఈ సినిమా నిన్న వాలెంటైన్స్ డే సందర్భంగా లాంఛనంగా లాంచ్ చేశారు.తమిళంలో ఎంట్రీ అయింది. మరి తెలుగులో ఏ సినిమాతో అవుతుందో చూడాలి.