కాంతార సీక్వెల్లో ఈ భామ!

- Advertisement -
Rukmini Vasanth

“సప్తసాగరాలు దాటి” అనే కన్నడ చిత్రంతో పాపులారిటీ తెచ్చుకొంది బెంగుళూర్ బ్యూటీ రుక్మిణి వసంత్. ఆమె అందం, ఆమె నటనకి చాలా మంది ఫిదా అయిపోయారు. తెలుగులో కూడా ఆమెని నటింపచెయ్యాలని కొందరు దర్శక, నిర్మాతలు ప్రయత్నించారు. కానీ అవి వర్కట్ కాలేదు.

తెలుగులో ఇప్పటివరకు ఆమెకి అవకాశం రాకపోయినా కన్నడ, తమిళ భాషల్లో మాత్రం బిజీ అవుతోంది. ఆమె ఖాతాలో ఇప్పుడు ఒక పాన్ ఇండియా చిత్రం చేరిందని అంటున్నారు.

దర్శకుడు రిషబ్ శెట్టి తనే హీరోగా నటించి, డైరెక్ట్ చేసిన ” కాంతార” సినిమా అన్ని భాషల్లో ఆడింది. ఆ సినిమా నిజమైన పాన్ ఇండియా బ్లాక్ బస్టర్. దాదాపు 400 కోట్ల రూపాయల వసూళ్లు అందుకొంది. ఈ సినిమాకి ఇప్పుడు మరో భాగం తీస్తున్నాడు. ” కాంతార చాప్టర్ 1″ పేరుతో రూపొందుతోన్న ఈ సినిమాలో రుక్మిణిని హీరోయిన్ గా తీసుకున్నారు అని టాక్. ఇది ఆమెకి బిగ్ ఆఫర్. ఎందుకంటే ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవల్లో విడుదల అవుతుంది. ఇది హిట్ అయితే ఆమెకి ఇండియా మొత్తం క్రేజ్ పెరుగుతుంది.

ఇక తమిళంలో శివ కార్తికేయన్ సరసన నటిస్తోంది. మురుగదాస్ దర్శకత్వంలో రూపొందే ఈ సినిమాలో ఈ భామ ఛాన్స్ కొట్టేసింది.

 

More

Related Stories