మిస్సెస్ అరియనా కాబోతుందా?

Ariyana Glory

బిగ్ బాస్ తెలుగు నాలుగో సీజనుతో పాపులర్ అయిన భామల్లో ఒకరు…అరియానా గ్లోరీ. అంతకుముందు.. ఆమె యూట్యూబ్ వీడియోలతో పాపులరే. ఐతే, యాంకర్ గా కన్నా బిగ్ బాస్ వల్లే ఆమెకి ఎక్కువ ఫేమ్ వచ్చింది. ఇప్పుడు సినిమాలు, వెబ్ సిరీసులతో బిజీగా మారింది.

మరోసారి ఈ భామ వార్తల్లో నిలిచింది. ఇప్పుడు అరియానా పెళ్లి గురించే టాక్. ఆమెకి పెళ్లి ఫిక్స్ అయింది అని అంటున్నారు. మిస్ అరియానా మిసెస్ అరియానాగా మారబోతోంది అంటూ సోషల్ మిడియాలో డిస్కషన్ మొదలైంది.

ఐతే, ఆమెకి సంబంధించిన వారు ఇదంతా గాసిప్ అని అంటున్నారు. ఇటీవల ఆమె ఒక గోల్డ్ జువెల్లర్ బ్రాండ్ కోసం ఫోటోషూట్ చేసింది. ఆ కమర్షియల్ యాడ్ కోసం పెళ్లికూతురు గెటప్ లో దర్శనమిచ్చిందట. ఆ ఫోటోలని ఇన్ స్టాగ్రామ్ లో చూసి పొరబడి ఉంటారని వారు చెప్తున్నారు.

Also Check: Ariyana Glory in a Langa Voni – Stills

More

Related Stories