కమ్ముల, వెంకీ కాంబో…. ఉత్తదే!

Venkatesh and Sekhar Kammula

శేఖర్ కమ్ముల ప్రస్తుతం “లవ్ స్టోరీ” తీస్తున్నాడు. నాగ చైతన్య, సాయి పల్లవి హీరోయిన్లు . కరోనా భూతం వెళ్ళిపోతే… అన్ని అనుకూలిస్తే.. దసరా పండక్కి రిలీజ్ చెయ్యాలనేది ప్లాన్. లేదంటే డిసెంబర్ లో రిలీజ్ ఉంటుంది. తన తదుపరి చిత్రాన్ని కూడా “లవ్ స్టోరీ” నిర్మాతలకు చేస్తాను అని కమ్ముల ఇంతకుముందే ప్రకటించారు.

అయితే, ఈ లాక్డౌన్ పీరియడ్ లో మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ రకరకాల కాంబినేషన్లు పుట్టుకొస్తున్నాయి. అలా చక్కర్లు కొట్టిన ఒక వార్త… శేఖర్ కమ్ముల ఇటీవల వెంకటేష్ ని కలిసి కథ చెప్పి ఓకే చేయించుకున్నాడని. కానీ కమ్ముల మాత్రం ఇది నిజం కాదంటున్నారు. రీసెంట్ గా ఇంట్లో నుంచి బయటికి అడుగుపెట్టలేదంట.

పూర్తిగా “లవ్ స్టోరీ” నెక్స్ట్ షూటింగ్ ఎప్పుడు మొదలు పెడుదాము అని మాత్రమే ఆలోచిస్తున్నారు. ఇంకా నెక్స్ట్ సినిమా హీరో గురించి ఆలోచించలేదట.  సో వెంకటేష్, కమ్ముల కాంబినేషన్ సెట్ అయింది అనే వార్తలో ప్రస్తుతానికి నిజం కాదు. తర్వాత ఉంటుందా అనేది కాలమే చెప్పాలి. 

Related Stories