టీవీల్లో సాహో క్లిక్ అవుతుందా?

Saaho

అప్పుడెప్పుడో థియేటర్లలోకి వచ్చిది ‘సాహో’ సినిమా. లాంగ్ గ్యాప్ తర్వాత ఇప్పుడు టీవీల్లో ప్రసారం కాబోతోంది. ఈ సినిమాకు థియేటర్లలో పెద్ద టాక్ రాలేదు. దీనికితోడు ఆల్రెడీ ఓటీటీలో వచ్చేసింది. ఈ నేపథ్యంలో టీవీలో టెలికాస్ట్ చేస్తే ‘సాహో’ క్లిక్ అవుతుందా?

కచ్చితంగా క్లిక్ అవుతుందంటున్నారు కొంతమంది. ఇక్కడ వాళ్లు రెండు లాజిక్స్ చెబుతున్నారు. ఒకటి ప్రభాస్ కున్న డై-హార్డ్ ఫ్యాన్ ఫాలోయింగ్. త్వరలోనే టీవీల్లో సాహో సినిమా రాబోతోందనే విషయాన్ని ఫ్యాన్స్ భుజానికెత్తుకున్నారు. ఫుల్లుగా ప్రమోషన్ ఇస్తున్నారు. టెలికాస్ట్ రోజు టీవీలకు అతుక్కుపోవడం ఖాయం. 

ఇక రెండో అంశం ఏంటంటే.. యాక్షన్ సినిమాలు టీవీల్లో ఫెయిల్ అయిన దాఖలాలు పెద్దగా లేవు. థియేటర్లలో ఫ్లాప్ అయినప్పటికీ మంచి యాక్షన్ కంటెంట్ ఉంటే టీవీల్లో రేటింగ్స్ వచ్చిన సందర్భాలున్నాయి. యాక్షన్ విషయంలో ‘సాహో’ను వంక పెట్టడానికి లేదు.

సో.. ఈ రెండు కారణాల పరంగా చూసుకుంటే బుల్లితెరపై ప్రభాస్ మూవీ క్లిక్ అవుతుందనే అంటున్నారు. జీ తెలుగు ఛానెల్ లో 18న టెలికాస్ట్ కానుంది ఈ సినిమా.

Related Stories