టీవీల్లోనూ సాహో అట్టర్ ప్లాప్

ప్రభాస్ హీరోగా నటించిన భారీ బడ్జెట్ మూవీ ‘సాహో’, ఆల్రెడీ థియేటర్లలో ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ మూవీ మరోసారి ఫ్లాప్ అయింది. అవును.. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెరపై టెలికాస్ట్ చేసిన ఈ సినిమాకు చాలా తక్కువ రేటింగ్ వచ్చింది.

18వ తేదీ ఆదివారం నాడు జీ తెలుగు ఛానెల్ లో ‘సాహో’ సినిమాను ప్రసారం చేశారు. అంతకంటే ముందు భారీగా ప్రచారం కూడా కల్పించారు. కానీ బుల్లితెర వీక్షకులు సినిమాకు కనెక్ట్ కాలేకపోయారు. ఫలితంగా 5.82 (అర్బన్) టీఆర్పీతోనే ఈ సినిమా సరిపెట్టుకోవాల్సి వచ్చింది. బహుశా మహేష్ బాబు బ్రహ్మోత్సవం తర్వాత టీవీల్లో అతిపెద్ద ఫ్లాప్.

ఈ సినిమా ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో వచ్చేసింది. దీనికి తోడు టీవీలో టెలికాస్ట్ కు చాలా గ్యాప్ వచ్చేసింది. అందుకే ఈ మూవీకి రేటింగ్ తగ్గి ఉంటుందని భావిస్తున్నారు.

ప్రభాస్ కి ప్రస్తుతం ఉన్న స్టార్ ఇమేజ్ కి ఎంత లేదన్న కనీసం 10 పాయింట్లు అన్నా రావాలి. తెలుగు జనం “సాహో” విషయంలో కనికరం చూపలేదు. థియేటర్లో, టీవీల్లో రెండు చోట్లా రిజెక్ట్ చేశారు.

Related Stories