ఫ్లాప్ వచ్చినా నచ్చిందంటున్న పిల్ల!


నివేథా థామస్ కి ఈ మధ్య హిట్ లేదు. పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ చిత్రమే చెప్పుకోదగ్గ హిట్. తాజాగా ‘శాకిని డాకిని’ అనే సినిమా చేసింది. గత వారం విడుదలైన ఈ సినిమా ఘోర పరాజయం చూసింది. సినిమా పోస్టర్లకి అంటించే మైదా పిండి డబ్బులు కూడా రాలేదు థియేటర్ల నుంచి.

Advertisement

అంత ఘోరంగా సినిమా ఫ్లాప్ అయితే తన పాత్రకి మంచి పేరు వచ్చింది అని, జనం మెచ్చుకున్నారు అని ట్విట్టర్లో రాసుకొంది ఈ పిల్ల. ఈ సినిమాలో ఆమె ప్రతి అమ్మాయిని పిల్ల అని పిలుస్తుంటుందిలెండి అందుకే మేం కూడా పిల్ల అని రాస్తున్నాం. “శాలిని పాత్ర పోషించడం చాలా ఎంజాయ్ చేశాను. నేను ఇష్టపడ్డట్లే ప్రేక్షకులు కూడా ఇష్టపడ్డారు ఆ పాత్రకి. ఇక నెక్స్ట్ మూవీపై నా ఫోకస్,” అంటూ రాసుకొంది.

అసలు జనమే ఆ సినిమా చూడలేదు. క్రిటిక్స్ కూడా సినిమాని చీల్చి చెండాడారు. మరి ఆమె పాత్రని మెచ్చుకున్నది ఎవరో, ఇష్టపడ్డది ఎవరో? బహుశా ఆమె మేకప్ పర్సన్, హెయిర్ స్టైలిస్ట్, ఇతర స్టాఫ్ మెంబర్స్ కాబోలు.

నివేథా థామస్ తన పాత్రని బాగానే పోషించింది కానీ సినిమా మాత్రం ఎవరికీ నచ్చలేదు. ఫ్లాప్ ని ఫ్లాప్ అని అంగీకరించకపోతే ఎలా? ఒక 15 ఏళ్ల క్రితం చాలా మంది దర్శకులు ఈమె తరహాలోనే ప్రవర్తించేవారు. “మా సినిమా పోయింది కానీ దర్శకుడిగా నేను ఫెయిల్ కాలేదు,” అని చెప్పుకునేవారు. నివేథా కూడా ఆ బాపతేనా.

Advertisement
 

More

Related Stories