- Advertisement -

“బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్”, “పిట్ట కథలు”, “సైరా నరసింహారెడ్డి”, “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్” చిత్రాల్లో నటించిన యువ హీరోయిన్ శాన్వి మేఘన. ఈ వీకెండ్ విడుదలవుతోన్న “పుష్పక విమానం”లో ఆమె ఒక హీరోయిన్. ఈ చిత్రం గురించి, తన కెరీర్ గురించి మీడియాతో ముచ్చటించింది శాన్వి మేఘన.
- “నేను హైదరాబాద్ అమ్మాయిని. ఒక టీవీ కార్యక్రమం కోసం జయసుధ గారు నన్ను అడిగారు. ఆమెఆ టీవీ ప్రోగ్రాంకి నిర్మాత. కానీ అనుకోని కారణాల రెండు ఎపిసోడ్స్ షూట్ చేసిన తర్వాత అది ఆగిపోయింది. ఆ తర్వాత “బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్” అనే చిత్రంలో నాయికగా అవకాశం వచ్చింది. ఆ సినిమా అయ్యాక మెగాస్టార్ సైరా నరసింహా రెడ్డి లో ఓ చిన్న క్యారెక్టర్ ప్లే చేశాను. సైరా తర్వాత తరుణ్ భాస్కర్ గారు నెట్ ఫ్లిక్స్ పిట్ట కథలు వెబ్ సిరీస్ కు ఆడిషన్ చేసి తీసుకున్నారు. ఆయనే “పుష్పక విమానం” చిత్రానికి నన్ను రిఫర్ చేశారు.”
- “పుష్పక విమానం” చిత్రంలో నేను షార్ట్ ఫిల్మ్ హీరోయిన్ క్యారెక్టర్ లో కనిపిస్తాను. చాలా బబ్లీ రోల్ ఇది. హీరో ఆనంద్, గీత్ సైని, నా క్యారెక్టర్స్ ఎక్కడా రెగ్యులర్ హీరో హీరోయిన్స్ క్యారెక్టర్స్ లా ఉండవు. అవి కథలో సహజంగా ప్లే అవుతూ ఉంటాయి.
- “పుష్పక విమానం” ఫస్టాప్ చాలా ఫన్ గా సాగుతుంది. సెకండాఫ్ ఎమోషనల్ గా ఉంటుంది. సినిమాలో ఆనంద్ క్యారెక్టర్ తో నా రిలేషన్ ఏంటి అనేది తెరపైనే చూడాలి.
- ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ నా గురించి బాగా చెప్పారు. నా పర్మార్మెన్స్ బాగుందన్నారు. అక్కడే మా అమ్మా నాన్న కూడా ఉన్నారు. అందరం హ్యాపీ.
- ఇలాంటి క్యారెక్టర్ లే చేయాలని నియమం పెట్టుకోలేదు. నచ్చితే ఎలాంటి సినిమాలో అయినా నటిస్తాను.
- ఇష్టమైన హీరోయిన్ శ్రీదేవి గారు, హీరో అల్లు అర్జున్.
- ప్రస్తుతం రెండు, మూడు చిత్రాలు చర్చల్లో ఉన్నాయి.