- Advertisement -

అల్లరి నరేష్ హీరోగా ఈ ఏడాది ప్రారంభంలో అనౌన్స్ చేసిన ‘సభకు నమస్కారం’ ఈ రోజు లాంచ్ అయింది. ‘నాంది’ సినిమాతో మంచి విజయం అందుకున్నారు అల్లరి నరేష్. కామెడీ చిత్రాల పరంపర నుంచి సీరియస్ చిత్రాల వైపు పయనం మొదలుపెట్టారు నరేష్. లేటెస్ట్ గా చేస్తున్న మూవీ… ‘సభకు నమస్కారం’.
మహేష్ కోనేరు నిర్మిస్తున్న ఈ మూవీకి సతీష్ మల్లంపాటి దర్శకుడు. అబ్బూరి రవి డైలాగ్ లు అందిస్తున్నారు. అల్లరి నరేష్ కూతురు ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టింది.
సెప్టెంబర్ లో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు.