అలియాకి డిస్లైక్ ల షాక్!

Alia Bhatt

ఈ మధ్య కాలంలో ఆలియా భట్ తెచ్చుకున్నంత నెగెటివ్ ఇమేజ్ మరో హీరోయిన్ తెచ్చుకోలేదు. సుశాంత్ సింగ్ మరణంతో … నెపోటిజం అనేది ఒక పెద్ద టాపిక్ అయింది. ఆలియా గతంలో సుశాంత్ గురించి తక్కువగా మాట్లాడడం, ఆ వీడియోలు బయటకు రావడంతో ఆమెకి బాడ్ ఇమేజ్ వచ్చింది. ఇప్పటికే ఎంతో ట్రోలింగ్ ఫేస్ చేసింది. ఇప్పుడు ఆమె సినిమాలకి కూడా ఈ సెగ తగిలింది.

అలియా భట్ హీరోయిన్ గా నటించిన “సడక్ 2” ట్రైలర్ ఈ రోజు విడుదల అయింది. ఈ ట్రైలర్ … మరీ గొప్పగా లేకపోయినా మరీ బాడ్ గా లేదు. జస్ట్ ఒకే. ఐతే విచిత్రంగా దీనికి డిస్ లైక్ (dislike)ల బెడద ఎక్కువగా ఉంది. ఇంకా చెప్పాలంటే చాలా షాకింగ్ రేంజ్ లో ఉన్నాయి డిస్లైక్లు. ఈ ట్రైలర్ కి లక్ష వరకు లైకులు వచ్చాయి. డిస్ లైకులు ఇప్పటికే 15 లక్షలు దాటాయి. ఇంకా పెరుగుతాయి.

కేవలం ఆలియా భట్ నటించింది అన్న కోపమే. సుశాంత్ అభిమానులతో పాటు ఒక పొలిటికల్ పార్టీ కార్యకర్తలు ఈ నెగటివ్ కాంపైన్ షురూ చేసారని అంటున్నారు. ఏది ఏమైనా… అలియా భట్ కొత్త సినిమాలకి ఈ బెడద కొన్నాళ్ల పాటు ఉండేలా ఉంది.

Sadak 2 | Official Trailer | Sanjay | Pooja | Alia | Aditya | Jisshu | Mahesh Bhatt | 28 Aug

Related Stories