‘కబాలి’ ధన్సిక హీరోయిన్ గా ‘దక్షిణ’


‘మంత్ర’, ‘మంగళ’ వంటి హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు తీసి పేరు తెచ్చుకున్న దర్శకుడు ఓషో తులసీరామ్. కొంత గ్యాప్ తర్వాత ఆయన మళ్ళీ మెగాఫోన్ పట్టారు. ‘దక్షిణ’ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రోజు పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభమైంది.

కబాలి సినిమాలో నటించిన సాయి ధన్సిక ఇందులో హీరోయిన్.
 
“సాయి ధన్సిక, ఓషో తులసీరామ్ కలయికలో సినిమా చేయడం సంతోషంగా ఉంది. తెలుగులో ‘మంత్ర’, ‘మంగళ’ ఫిమేల్ ఓరియెంటెడ్ థ్రిల్లర్స్ ట్రెండ్ సెట్ చేశాయి. ఆ సినిమాల తరహాలో ‘దక్షిణ’ ఉంటుంది.,” అన్నారు నిర్మాత అశోక్ షిండే.

హైదరాబాద్, గోవా నేపథ్యంగా సాగే ఈ సినిమా కూడా థ్రిల్లర్. హీరోయిన్ ప్రధానంగానే సాగుతుంది.

 

More

Related Stories