
సాయి ధరమ్ తేజ్ కి తన పేరుకి మార్పులు, చేర్పులు చెయ్యడం అంటే ఇష్టం కాబోలు. కొన్నాళ్ళూ తన పేరులో ధరమ్ అనేది తీసేశాడు. సింపుల్ గా సాయి తేజ్ అని పిలవమన్నాడు.
ఇప్పుడు ధరమ్ స్థానంలో దుర్గ యాడ్ చేశాడు. సాయి ధరమ్ తేజ తల్లి పేరు విజయదుర్గ. తన తల్లి పేరుని తన పేరుకి కలిపి ఇప్పుడు సాయి దుర్గ తేజ్ అని పిలవమంటున్నాడు. ఇదంతా సినిమాల్లో, మీడియాల్లో రాయడానికి లెండి. లీగల్ గా మార్చుకోవడంలాంటిదేమి ఉండదు.
అలా ఇప్పుడు తన తల్లి పేరు మీద సొంత నిర్మాణ సంస్థ ఏర్పాటు చేశారు. విజయ దుర్గ ప్రొడక్షన్స్ సంస్థ అనే పేరుతో బ్యానర్ స్థాపించారు. “సత్య” అనే షార్ట్ ఫిలింని దిల్ రాజు ప్రొడక్షన్స్ తో కలిసి తన తల్లి పేరు మీద నెలకొల్పిన బ్యానర్ ఫై నిర్మించాడు. భారతీయ సైనికులకు నివాళిగా ఉంటుంది ఈ షార్ట్ ఫిలిం. ఇందులో అతనితో పాటు కలర్స్ స్వాతి నటించింది.
ఇక పనిలో పనిగా తన పేరుని సాయి ధరమ్ తేజ్ ని సాయి దుర్గ తేజ్ గా మార్చుకున్నట్లు, తన తల్లి ఎప్పుడూ తనతో ఉండాలని ఇలా చేశానని చెప్పుకున్నాడు. ఈ పేరు ఎన్నాళ్ళో చూడాలి.