సాయిధరమ్ తేజ్ 20 లక్షల విరాళం

- Advertisement -
Sai Dharam Tej

సాయిధరమ్ తేజ్ ఈ రోజు తన పుట్టిన రోజుని వెరైటీగా సెలెబ్రేట్ చేసుకున్నాడు. పోలీసులకు, మిలటరికీ విరాళం ఇచ్చి తన పుట్టిన రోజుని గొప్పగా జరుపుకున్నాడు. 36 ఏళ్ల సాయిధరమ్ తేజ్ ఛారిటీలో ఎప్పుడూ ముందు ఉంటాడు. సోషల్ రెస్పాన్సబిలిటీ కూడా ఎక్కువే.

ఇక పోలీసులు, సైనికులకు ఎంతో గౌరవం ఇస్తాడు. భారత సైన్యం అనగానే ఎమోషనల్ అవుతాడు. ఇటీవల “ది సోల్ ఆఫ్ సత్య” అనే షార్ట్ ఫిల్మ్‌లో సైనికుడిగా నటించి, ఆగస్టు 15న భారతీయ సైనికులకు సెల్యూట్ చేస్తూ దాన్ని విడుదల చేశాడు.

తాజాగా భారత సైన్యం కోసం 10 లక్షలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పోలీసు అకాడమీలకు చెరొక 5 లక్షలు విరాళంగా ఇచ్చారు. మొత్తంగా 20 లక్షలు.

గత సంవత్సరం ఒక వృద్ధ పేద మహిళకి పక్కా ఇల్లు కోసం విరాళమిచ్చిన విషయం తెలిసిందే. ఈ పుట్టిన రోజు సందర్భంగా “గాంజా శంకర్” అనే కొత్త సినిమా పోస్టర్ కూడా విడుదల చేశాడు. ఈ సినిమా కి సంపత్ నంది దర్శకుడు.

ALSO READ: Sai Dharam Tej to play Gaanja Shankar

 

More

Related Stories